హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతాఫలం టెండర్ వేలానికి ఏర్పాట్లు

VKB: జిల్లా పరిధిలోని ఐదు అటవీ రేంజ్‌లకు సంబంధించిన సీతాఫలం టెండర్ వేలాన్ని ఈనెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి బత్తుల విశాల్ తెలిపారు. వేలంలో ఆసక్తి ఉన్నవారు ఈనెల 24న ఉదయం 11 గంటలకు జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. టెండర్ ప్రక్రియలో పాల్గొనేవారు నిర్ణీత సమయానికి చేరుకోవాలని తెలిపారు.