KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు గొర్రెలపై దాడి చేయడంతో ధారావత్ చందర్‌కు చెందిన నాలుగు గొర్రెలు మృతి చెందాయి. కుక్కల నుంచి గొర్రెలను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని బాధితుడు తెలిపారు. ఘటనతో తీవ్రంగా నష్టపోయిన తనకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని చందర్ కోరారు.
తెలంగాణ
రేసు కుక్కల దాడిలో 4 గొర్రెలు మృతి


