హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

CTR: గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద మినీ కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న తమిళనాడు బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో 90 బ్యాగుల్లో ఉన్న 4,500 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని చెప్పారు. బియ్యాన్ని తరలిస్తున్న రాణిపేటకు చెందిన లోకేష్ పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.