హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈరన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KRNL: కౌతాళం (మం) ఉరుకుందలోని ప్రసిద్ధ శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది, భక్తులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు.