హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత కొత్త ఓటర్లుగా నమోదు కావాలి

CTR: జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తైన యువతీ, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 30లోపు అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.