హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీబీపై అవగాహన సదస్సు, ర్యాలీ

SRD: క్షయ రహిత భారత్‌ సాధనలో విద్యార్థుల పాత్ర కీలకమని జిల్లా క్షయ నియంత్రణ కోఆర్డినేటర్ అరుణ అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో టీబీపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. 'టీబీ ముక్త్ భారత్' యాప్‌లో విద్యార్థులను వాలంటీర్లుగా నమోదు చేసి, గ్రామాల్లో ప్రజలకు క్షయపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.