హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి

AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామ శివారు ప్రాంతంలో కోడిపందాల శిబిరంపై పోలీసులు బుధవారం సాయంత్రం దాడి చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 4,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.