హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొర్రెల రుణాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన

కడప జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. NCDC పథకం కింద రూ.2.80 లక్షల రుణం మంజూరైనట్లు సమాచారం ఉండగా, లబ్ధిదారులకు రూ.30 వేలే అందాయని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సమస్యపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.