హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి'

ASR: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా కళాశాలలు, కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలన్నారు. ఆగస్టు 31న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.