హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIRపై రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం

SRPT: SIRలో భాగంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, ఫిర్యాదులపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బీ. హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.