హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం: ఈవో

NLR: జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో రెండవ శ్రావణ శుక్రవారం ఉదయం 9 గంటలకు సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం జరుగుతుందని ఈవో శ్రీనివాసులురెడ్డి ప్రకటనలో తెలిపారు. వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు టికెట్ కార్యాలయం నందు లేక aptemples.ap.gov.in ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీసులు పొందాలన్నారు.