హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమ్మాలపాడులో ప్రమాదకరంగా హైవే

BPT: సంతమాగులూరు కొమ్మాలపాడు సెంటర్‌లోని మేదరమెట్ల–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారి ఆక్రమణలు, రోడ్డు పక్కన వాహనాల నిలుపుదలతో ప్రమాదాలకు కేంద్రంగా మారింది. దుకాణాల ముందు వాహనాలను అడ్డంగా నిలపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రహదారిపై మార్జిన్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఇక్కడే మృతి చెందారు.