SDPT: సీపీ కనెక్ట్ వేదికగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది పోలీసు సిబ్బందిని సీపీ రష్మి పెరుమాళ్ బుధవారం కమిషనరేట్‌లో అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. శాంతిభద్రతల రక్షణ, నేరాల కట్టడికి సిబ్బంది చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు. రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉంటూ దొంగతనాల నివారణకు కృషి చేసిన వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.
తెలంగాణ
విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపు: సీపీ


