హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అస్తవ్యస్తంగా రోడ్లు'

WNP: ఆత్మకూరు పట్టణం నుండి శ్రీరామనగర్ స్టేషన్‌కు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతిని, గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు నానా తంటాలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, ప్రత్యామ్నాయంగా నూతన రోడ్డును వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.