హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుజాత సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

RR: సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. నల్లగండ్లలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్రతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సుజాత యాదవ్ మృతి సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.