SKLM: పలాస దళిత వాడల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని KVPS ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ త్రినాధ్‌కు వినతిపత్రం ఇచ్చారు. సూదికొండలో రోడ్లు, మంచినీరు లేవని, పారసాంబలో మురికి కాలువలు శుభ్రం చేయడం లేదని, దళితవాడ మండపం మరమ్మత్తులు చేయడం లేదని నాయకులు ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని, అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక భవనం నిర్మించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
దళిత వాడల సమస్యలపై వినతి


