హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే రేగాకు భారీ ఊరట..!

BDK: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఫిర్యాదు చేసిన సదరు యువతిపైన ఇప్పటికే పలు చీటింగ్ కేసులు ఉండటాన్ని కోర్టు గమనించింది. దీంతో ఈ కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.