హైదరాబాద్: 28°C
వ్యాపారం

దక్షిణాదిలో విస్తరించనున్న యాక్టివ్ గ్రీన్

విలాసవంత కిటికీలు, స్మార్ట్ బిల్డింగ్ పరిష్కారాలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసే సంస్థ యాక్టివ్ గ్రీన్ 15 కొత్త ఫ్రాంచైజీలను ప్రారంభించనుంది. వచ్చే 18 నెలల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల్లో కలిపి 15 కొత్త ఫ్రాంచైజీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. విశాఖ, తిరుపతి/నెల్లూరు, వరంగల్, భువనేశ్వర్‌లలో స్టోర్లు ప్రారంభిస్తామని సంస్థ వెల్లడించింది.