ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామస్థులు తమకు నివాస స్థలాలు కేటాయించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ డి. రిబ్కా రాణికి వినతిపత్రం అందించారు. ఈ విషయంలో గ్రామస్థులకు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది. అర్హులను గుర్తించి వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నివాస స్థలాలు కేటాయించాలని నిరసన


