RR: గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) కేటగిరీ–1 ధ్రువీకరణ లభించింది. మైదానం, ఆస్ట్రోటర్ఫ్, లైటింగ్, భద్రత, ఇతర మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు FIH నిర్ధారించింది. దీంతో దేశంలో కేటగిరీ–1 ధ్రువీకరణ పొందిన తొలి, ఏకైక ఆస్ట్రోటర్ఫ్ హాకీ మైదానంగా గచ్చిబౌలి గుర్తింపు పొందింది. ఈ ధ్రువీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు చెల్లుతుంది.
తెలంగాణ
దేశంలో తొలి కేటగిరీ–1 హాకీ మైదానం


