హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన నాగులుప్పలపాడు యాదవులు

ప్రకాశం: నాగులుప్పలపాడు (మం) ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు బుధవారం తాడేపల్లిలోని వై‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగిన దాడి, అనంతరం తమపైనే నమోదైన కౌంటర్‌ కేసు, పోలీసుల వ్యవహారశైలితో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.