హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా కిమిడి నాగార్జున జన్మదిన వేడుకలు

VZM: డీసీసీబీ ఛైర్మన్, టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీసీబీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.