హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూద స్థావరాలపై ఉక్కుపాదం!

బాపట్ల జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ జూద కార్యకలాపాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బాపట్లలో పోలీసులు ఓ జూద స్థావరంపై విస్తృత దాడులు నిర్వహించి, జూదరులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పరిధిలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.