నెల్లూరు నగరపాలక సంస్థ కమీషనర్ నందన్‌ను బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీధి వ్యాపారాలు చేసే దివ్యాంగులు కలిశారు. అల్లీపురం టిడ్కో గృహాలలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కమీషనర్ ప్రభుత్వ నిర్దేశకాలను పరిశీలించి, దివ్యాంగుల విజ్ఞప్తిని ప్రత్యేకంగా పరిగణించి గృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వీధి వ్యాపారుల దివ్యాంగులకు కమీషనర్ భరోసా


