SS: పుట్టపర్తిలో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి గౌరవ న్యాయస్థానం రూ.10,000 జరిమానా విధించినట్లు సీఐ యువరాజు తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని పుట్టపర్తి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, తప్పు అంగీకరించడంతో ఈ శిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10 వేల జరిమానా


