హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PDS, LPG సమస్యలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష

SS: ప్రజా పంపిణీ వ్యవస్థ, గ్యాస్ సరఫరా, ఇ-కేవైసీ సేవలపై శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీపం పథకం సబ్సిడీ సమస్యలు, రైస్ కార్డుల ఇ-కేవైసీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి, రేషన్ బియ్యం పంపిణీ వేగవంతం చేయాలన్నారు.