హైదరాబాద్: 28°C
వ్యాపారం

హియర్‌జాప్ చేతికి ఆంప్లిఫోన్ ఇండియా

ఆంప్లిఫోన్ ఇండియా వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సంస్థ హియర్‌జాప్ ప్రకటించింది. ఈ కొనుగోలుతో ఆంప్లిఫోన్ ఇండియాకు చెందిన 240 విక్రయ కేంద్రాలు హియర్‌జాప్ పరిధిలోకి వచ్చాయి. తాజా విలీనం తర్వాత దేశవ్యాప్తంగా హియర్‌జాప్ కేంద్రాల సంఖ్య 420కి చేరింది. వచ్చే ఏడాదికి ఈ నెట్‌వర్క్‌ను 500 కేంద్రాలకు విస్తరిస్తామని సంస్థ వెల్లడించింది.