NLR: యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు కోవూరును మున్సిపాలిటీగా చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి బుధవారం అసెంబ్లీలో కోరారు. కోవూరు పంచాయతీ 4 కి.మీ. పరిధిలో విస్తరించి, సుమారు 45 వేల జనాభా ఉందన్నారు. దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ.. 2027 మార్చి 31 తర్వాత కోవూరును మున్సిపాలిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోవూరును మున్సిపాలిటీగా చేయాలి: ఎమ్మెల్యే


