హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలియని వ్యక్తులతో జాగ్రత్త : ఎస్సై

WG: మొగల్తూరు మండలం కేపీ పాలెం లో ఉన్న ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థినులకు ఫోక్సో చట్టాలపై ఎస్సై సిహెచ్ జయలక్ష్మి బుధవారం అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని, ఎవరైనా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.