హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

NDL: మిడుతూరు గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, వైరల్‌ ఫీవర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఆర్‌.వెంకటరమణ సూచించారు. మిడుతూరు (మం) తలముడిపి పీహెచ్‌సీ, రోళ్లపాడు సబ్‌సెంటర్లను బుధవారం తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరా తీశారు. ఇళ్లలో, పరిసరాల్లో చెత్త, మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.