KKD: కరప మండలం కొంగోడు వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం చోరీ జరిగింది. ఉదయం గుడి తెరిచిన అర్చకుడు రామానుజాచార్యులు చోరీని గుర్తించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 1.070 కేజీల వెండి, 10 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో దొంగతనం జరగడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొంగోడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ


