హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్బీచర్ల హైస్కూల్లో భేటీ బచావో బేటి పడావో

WG: నర్సాపురం మండలం ఎల్బీచర్ల హైస్కూల్ విద్యార్థులకు బుధవారం 'బేటీ బచావో-బేటీ పడావో'పై ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఊర్మిళ అవగాహన కల్పించారు. కిశోర బాలికలకు పోషణ, ఆరోగ్యం, బాల్యవివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టం, విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, ఆర్థిక నిర్వహణ తదితర అంశాలను వివరించారు. కార్య క్రమంలో HM నరసింహమూర్తి, సూపర్వైజర్ మహాలక్ష్మి పాల్గొన్నారు