హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు కుమ్మరి సంఘం చేయూత

RR: కొందుర్గు మండలం గంగన్నగూడెం ప్రాథమిక పాఠశాలలో షాద్‌నగర్ కుమ్మరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. 27 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు సౌండ్ బాక్స్ అందజేశారు. పాఠశాల మరమ్మతుల కోసం రూ.10 వేల విరాళం అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శిరీష, ఉపాధ్యాయులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.