హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమాండ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

CTR: జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ తుషార్ బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, ట్రాఫిక్ మానిటరింగ్, అత్యవసర స్పందన వ్యవస్థ పనితీరును తనిఖీ చేశారు. జిల్లా ప్రజలకు నిరంతర భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అన్నారు. డయల్-112 సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, అత్యవసర ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.