హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోయిల్ సాగర్ నీటి విడుదల

NRPT: ఉమ్మడి జిల్లా మధ్యతరహా ప్రాజెక్టు కోయిల్ సాగర్ నుంచి పంట పొలాలకు బుధవారం డీసీసీ ఉపాధ్యక్షుడు సూర్య మోహన్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాలకు సాగునీరు అందించారు.