హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా మట్టి రవాణా.. అడ్డుకున్న గ్రామస్థులు

NZB: జిల్లాలో మట్టి అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా నగర శివార్లలో ఉన్న గుండారం గ్రామం వద్ద బుధవారం అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్థులు పట్టుకున్నారు. అనంతరం వాటిని మైనింగ్, పోలీస్ శాఖలకు అప్పగించారు. పాత వే బిల్లులతో వీటిని రవాణా చేస్తున్నట్లు వారు తెలిపారు. యథేచ్ఛగా పాత వే బిల్లులతో సాగుతున్న మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు.