KMM: ముదిగొండ (M) కమలాపురం, భానాపురం, వనంవారి కృష్ణాపురంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను బుధవారం ముదిగొండ వ్యవసాయ అధికారి సరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని స్పష్టం చేశారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు: AO


