PLD: నరసరావుపేట (మం)లో 12వ వార్డు బాపనయ్య నగర్‌లో 35 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న 150కు పైగా పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ.. నివాసితులు మున్సిపల్ శాఖమంత్రి పొంగూరు నారాయణను విజయవాడలో కలిశారు. స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఎంపీ కృష్ణదేవరాయలు సహకరిస్తున్న విషయాన్ని మంత్రికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి నారాయణకు పేదల వినతి


