హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి'

TPT: శ్రీకాళహస్తిలోని అర్ధనారీశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జనసేన నాయకుడు దండి నరేంద్ర కోరారు. ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఆయన, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు, వసతి వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.