హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ దంపతులు పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.