హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు మరమ్మతులు చేపట్టాలి'

పార్వతీపురంలోని పాత బస్టాండ్‌ వద్ద ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శులు గొర్లి వెంకటరమణ, బీవీ రమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్‌ మేనేజర్‌ ఈశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. భారీ వాహనాలు, ఆటోలు, వాణిజ్య వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ రహదారిపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.