హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై స్తంభం.. స్థానికుల ఆందోళన

VKB: మండల కేంద్రంలోని గ్రంథాలయం, అంగన్‌వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న సీసీ రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉండటంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ వేగంగా వచ్చే వాహనాలు స్తంభాన్ని ఢీకొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ, పంచాయతీ అధికారులు స్పందించి స్తంభాన్ని రోడ్డు పక్కకు మార్చాలని కోరుతున్నారు.