హైదరాబాద్: 28°C
వ్యాపారం

RBI తీసుకొస్తున్న మార్పులు ఇవే..!

హోమ్ లోన్లకు సంబంధించి RBI కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల రీసెట్ సమయం మూడు నెలలకు మించకూడదని తాజా నిబంధనల్లో తీసుకొచ్చింది. దీంతో RBI వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు వేగంగా ఆ ప్రయోజనం దక్కుతుంది. అలాగే, వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఇదే నియమం వర్తిస్తుంది. దీనిపై సెప్టెంబర్ 11 వరకు అభిప్రాయాలను సేకరిస్తోంది. 2027 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.