హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన్నారంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

MNCL: జన్నారం మండల ఫోటో, వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో బుధవారం 187వ, ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల గౌరవ అధ్యక్షులు కస్తూరి ప్రభాకర్ ఫోటోగ్రఫి జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు పోతూ వేణుగోపాల్, మండల అధ్యక్షులు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.