హైదరాబాద్: 28°C
తెలంగాణ

61.76 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు: మంత్రి

KMM: గొల్లగూడెం-పల్లెగూడెం మధ్య NSP కాల్వగట్టుపై రూ.5.80 కోట్లతో మోడల్ CC రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయని బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పల్లెగూడెం సమగ్ర వికాసానికి రూ.61.76 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. గ్రామంలో ఇప్పటికే రూ.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని అన్నారు.