VKB: మర్పల్లి రైల్వే గేట్ వద్ద రెండు రోజులుగా ట్రాక్ పనులు కొనసాగడంతో గేట్ మూసివేశారు. పనులు పూర్తవడంతో అధికారులు నేడు ఉదయం గేట్‌ను తిరిగి తెరిచారు. దీంతో వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఎదురైన ఇబ్బందులు తొలగడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. మండల ప్రజలు యథావిధిగా ప్రయాణాలు కొనసాగించవచ్చు.
తెలంగాణ
ట్రాక్ పనులు పూర్తి.. గేట్ ఓపెన్


