హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏఐటీయూసీ మహాసభలను విజయవంతం చేయాలి'

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్మిక భవన్‌లో బుధవారం జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 6,7,8 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజ్ పిలుపునిచ్చారు. 6న నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్మికులు,ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.