హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా 'మై ఆటో ఈజ్ సేఫ్' అవగాహన సదస్సు

SRPT: కోదాడ పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా 'మై ఆటో ఈజ్ సేఫ్' ప్రాజెక్ట్‌లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై ఆటోలకు క్యూఆర్ కోడ్ రక్షణ స్టిక్కర్లను అందజేశారు. ప్రయాణికుల, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ఎమర్జెన్సీ బటన్ సదుపాయం ఉందని ఎస్పీ అన్నారు.