హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దక్షిణ కైలాసంగా మొగిలేశ్వర ఆలయం

CTR: బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ మొగిలేశ్వర స్వామి ఆలయం విశిష్టతకు ప్రసిద్ధి. ‘దక్షిణ కైలాసం’గా పేరొందిన ఈ ఆలయంలో శివునితో పాటు ప్రదక్షిణ సమయంలో దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడి దర్శనం లభించడం ప్రత్యేకత. మూడు గోపురాలు, అద్భుత శిల్పకళతో అలరించే ఆలయానికి చోళుల కాలం నాటి శాసనాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.