ASR: చింతపల్లి మండలంలోని శాడిక గ్రామంలో బుధవారం ఏవో టీ.మధుసూదనరావు “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పించారు. వరి పంటకు పంటల బీమా చేసుకునే గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఏవో రైతులకు తెలిపారు. అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా చేయించుకుని, ఆర్థిక రక్షణ పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బీమా గడువు పొడిగింపు: ఏవో


